Jamun Tree Leaves: నేరేడు పండ్లు మాత్రమే కాదండోయ్‌.. ఆకుల‌తో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా..!

నేరేడు పండ్లు మాత్ర‌మే కాదు.. ఈ చెట్టు ఆకులు కూడా ఎన్నోరకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటాయని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మధుమేహం బాధితులకు నేరేడు ఆకులు వ‌రంగా చెబుతున్నారు ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు. నేరేడు ఆకుల్లో ఉండే ఔషధ గుణాలు ర‌క్తంలో చ‌క్కెర నెమ్మ‌దిగా విడుద‌ల అయ్యేలా చేస్తాయి.

నేరేడు ఆకుల నుంచి ర‌సం తీసి పావు టీస్పూన్ చొప్పున భోజ‌నానికి ముందు తీసుకున్నట్టయితే మంచి ఫలితం ఉంటుంది

ఈ ఆకుల‌ను నీటిలో వేసి మ‌రిగించి ఆ నీళ్ల‌ను రోజుకు 2 సార్లు భోజ‌నానికి అరగంట ముందు ఒక క‌ప్పు మోతాదులో తీసుకుంటూ ఉంటే.. మీ బ్లడ్‌ షుగర్‌ అదుపులో ఉంటుంది.

నేరేడు ఆకుల్లో ఉండే స‌మ్మేళ‌నాలు జీర్ణ వ్య‌వ‌స్థ‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి. తరచూ విరేచనాల సమస్యతో బాధపడేవారు నేరేడు ఆకుల కషాయాన్ని తాగితే ఉపశమనం పొందుతారు.

కాలేయం పనితనం మెరుగుపడడానికి కూడా నేరేడు ఆకుల కషాయం ఎంతో మేలు చేస్తుంది. క‌డుపు ఉబ్బ‌రం, గ్యాస్‌, అజీర్తి, అసిడిటీ వంటి స‌మ‌స్య‌ల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

నేరేడు ఆకుల రసంలో ధనియాలు వేసి తీసుకున్నట్లయితే జ్వరం తగ్గిపోతుంది. అధిక బరువుతో బాధపడేవారికి కూడా నేరేడు ఆకులు ఉపయోగపడతాయి.

నేరేడు ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియ‌ల్‌, యాంటీ ఇన్ ఫ్లామేట‌రీ గుణాలు ఉంటాయి. ఇవి నోరును ఆరోగ్యంగా ఉంచుతాయి. నేరేడు ఆకుల‌ను నేరుగా న‌మిలి తింటుండాలి. దీంతో నోట్లో ఉండే బ్యాక్టీరియా న‌శిస్తుంది. నోటి దుర్వాస‌న త‌గ్గుతుంది