Bilva Leaves | రోజూ ప‌ర‌గ‌డుపునే ఈ ఆకులు మూడింటిని న‌మిలి తింటే ఎలాంటి రోగం ఉండ‌దు..!

బిల్వ ప‌త్రాల‌ను స‌మ‌ర్పిస్తే శివుడు అనుగ్ర‌హిస్తాడ‌ని భ‌క్తులు విశ్వ‌సిస్తారు. అయితే ఆధ్యాత్మిక ప‌రంగానే కాదు, ఆరోగ్య ప‌రంగా కూడా బిల్వ ప‌త్రాలు మ‌న‌కు ఎంతో మేలు చేస్తాయి.

ఆయుర్వేద ప్ర‌కారం బిల్వ ప‌త్రాల‌ను అద్భుత‌మైన ఔష‌ధంగా చెబుతారు. ఇందులో అనేక ఔష‌ధ గుణాలు ఉంటాయి.

బిల్వ వృక్షానికి చెందిన ఆకుల‌ను ఎక్కువ‌గా ఔష‌ధంగా ఉప‌యోగిస్తారు. అలాగే ఈ చెట్టుకు చెందిన పండ్లు, వేర్లు, బెర‌డు కూడా ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటాయి.

బిల్వ ప‌త్రాల‌ను ఉప‌యోగించి జీర్ణ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. జీర్ణ వ్య‌వ‌స్థ‌కు చెందిన ప‌లు ఔష‌ధాల త‌యారీలో బిల్వ ప‌త్రాల‌ను ఉప‌యోగిస్తారు.

బిల్వ ప‌త్రాల్లో ఆస్ట్రింజెంట్ గుణాలు ఉంటాయి. అంటే విరేచ‌నాల నుంచి ఉప‌శ‌మ‌నాన్ని అందిస్తాయ‌న్న‌మాట‌. అలాగే జీర్ణ వ్య‌వ‌స్థ‌ను ర‌క్షిస్తాయి.

బిల్వ ఆకుల‌ను, మిరియాల‌ను వేసి మ‌రిగించిన క‌షాయాన్ని సేవిస్తుంటే విరేచ‌నం సాఫీగా అవుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం త‌గ్గుతుంది.