Bilva Leaves | రోజూ పరగడుపునే ఈ ఆకులు మూడింటిని నమిలి తింటే ఎలాంటి రోగం ఉండదు..!
బిల్వ పత్రాలను సమర్పిస్తే శివుడు అనుగ్రహిస్తాడని భక్తులు విశ్వసిస్తారు. అయితే ఆధ్యాత్మిక పరంగానే కాదు, ఆరోగ్య పరంగా కూడా బిల్వ పత్రాలు మనకు ఎంతో మేలు చేస్తాయి.
ఆయుర్వేద ప్రకారం బిల్వ పత్రాలను అద్భుతమైన ఔషధంగా చెబుతారు. ఇందులో అనేక ఔషధ గుణాలు ఉంటాయి.
బిల్వ వృక్షానికి చెందిన ఆకులను ఎక్కువగా ఔషధంగా ఉపయోగిస్తారు. అలాగే ఈ చెట్టుకు చెందిన పండ్లు, వేర్లు, బెరడు కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటాయి.